సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

HYD: వనస్థలిపురం, హిల్ కాలనీలో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 3 నుంచి 8 వరకు స్వామి వారి 27 వ బ్రహ్మోత్సవాల ను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్మారావు, ప్రధాన కార్యదర్శి చింతల రవికుమార్, పి.శ్రీధర్ రావు, భవాని ప్రమోద్ కుమార్ లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.