గుండెపోటుతో విద్యార్థి మృతి
RR: గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన ఇవాళ మైలార్ దేవ్ పల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. బాబుల్ రెడ్డి నగర్‌లో అభయ్ అనే విద్యార్థి ఆడుకుంటూ స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. బాలుడి మృతితో బాబుల్ రెడ్డి నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.