వడదెబ్బతో వ్యక్తి మృతి
MHBD: తొర్రూరు మండలం గుర్తూరు గ్రామానికి చెందిన సింగారం శ్రీనివాస్ (63) గత నాలుగు రోజుల క్రితం వ్యవసాయ పొలం దగ్గర వడదెబ్బకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాదులోని యశోద ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.