'పంచాయతీల బలోపేతమే సర్కార్ లక్ష్యం'

'పంచాయతీల బలోపేతమే సర్కార్ లక్ష్యం'

KNR: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్వీర్యమైన పంచాయతీలను పటిష్టం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం గన్నేరువరం మండలంలోని పార్వెల్ల, గన్నేరువరం, చొక్కారావుపల్లి, యాస్వాడ, సాంబయ్యపల్లి మాదాపూర్, జంగపల్లి, గునుకుల కొండాపూర్, చీమలకుంటపల్లి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.