నాగిరెడ్డిపేటలో సీఎం కప్ క్రీడ పోటీలు ప్రారంభం
KMR: నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను, ఎస్సై భార్గవ్ గౌడ్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, క్రీడాకారులు పాల్గొన్నారు.