మృతుల కుటుంబాలకు పరామర్శ
VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో ఇటీవల అంతుచిక్కని కారణాలతో వరుసగా ఏడుగురు మృతి చెందారు. ఈమేరకు సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, కార్యదర్శి వర్గ సభ్యులు లక్ష్మి, టీవీ రమణ, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వైద్యాధికారి కృష్ణారెడ్డిని కలిసి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.