బీజేపీ చీఫ్‌పై ఎంపీ చామల ఫైర్
HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి తట్టుకోలేకపోతున్నారని ఫైరయ్యారు. హైదరాబాద్ సిటీ అభివృద్ధి చెందకూడదన్న ఆలోచన రాంచందర్ రావులో కనిపిస్తోందన్నారు. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్యాత్మికత కోసం నిధులు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు.