బొలెరో, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
NRML: లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ మూలమలుపు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సై జీ. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టపల్లి(కే) గ్రామానికి చెందిన చించోలి సాయన్న(69) ఇవాళ ఉదయం తన భార్యను నిర్మల్ బస్టాండ్‌లో దించేందుకు తన స్కూటీపై వెళ్లాడు. మామడ నుండి నిర్మల్ వైపు వస్తున్న బొలెరో వాహనం అతివేగంగా ఢీకొనడంతో తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు.