చెరువులో గల్లంతైన సాయికిరణ్ గాలింపు ముమ్మరం
మహబూబాబాద్ జిల్లా అనంతారం చెరువులో మొన్న తెల్లవారుజామున గల్లంతైన భూక్య సాయి కిరణ్ ఆచూకీ మూడో రోజుకీ దొరకలేదు. సోమవారం చెరువులో రెస్క్యూ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. దేవుడి గుడి ప్రాంగణంలోని చిన్న చెరువులో కూడా వెతికినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.