వారిని ఈసీ ముందు నిల్చోబెడుతా: సీఎం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై బెంగాల్ CM మమతా బెనర్జీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బతికి ఉన్న అనేక మంది ఓటర్లను సవరించిన ఓటర్ల జాబితాలో చనిపోయినట్లుగా తప్పుడుగా ప్రకటించారన్నారు. చనిపోయినట్లు EC ప్రకటించిన వారిని తీసుకు వచ్చి ఎన్నికల కమిషన్ అధికారుల ముందు నిలబెడతానన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీని ఓడించేందుకు BJP, EC కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.