శబరిమలకు స్పెషల్ ట్రైన్ సర్వీస్..!
HYD: శబరిమల వెళ్లటం కోసం స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు SCR తెలిపింది. HYD చర్లపల్లి నుంచి కొల్లం జంక్షన్ వరకు ప్రతి సోమవారాల్లో (నవంబర్ 17, 24 తేదీలు, డిసెంబర్ నెలలో 1, 8, 15, 22, 29, 2026 జనవరి నెలలో 5,12,19 తేదీలలో) 07107 రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి, తెల్లవారుజామున 22 గం.కు కొల్లం చేరుకుంటుంది.