ఆలయ పూజారిపై చర్యలు తీసుకోవాలని వినతి
ADB: గుడిహత్నూర్ మండలంలోని ఉమ్రీ గ్రామ సమీపంలో గల రామాలయ పూజారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కలెక్టర్ రాజర్షి షాను కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. తప్పుడు ఆధార్ కార్డును తీసుకొని ఆలయ భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని వారు ఆరోపించారు. ఆయనపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని విన్నవించారు.