ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
PLD: మండల కేంద్రమైన నకరికల్లులో బుధవారం PMDS కిట్లపై ఏవో దేవదాస్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఆఫీసర్ దేవదాస్ మాట్లాడుతూ.. PMDS కిట్లపై ఉన్న 30 రకాల విత్తనాల తొలకరి వర్షాలు పడ్డప్పుడు వెదజల్లి 50 రోజులు తర్వాత కలియ దున్నడంవల్ల మొక్కలకు అవసరమైన సమగ్ర పోషకాలు లభిస్తాయని తెలిపారు.