తహసీల్దార్‌కు రైతుల సమస్యలపై వినతి

తహసీల్దార్‌కు రైతుల సమస్యలపై వినతి

కృష్ణా: మొవ్వ మండలంలోని పీఏసీఎస్‌లలో యూరియా కొరతపై పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎరువుల కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి పుష్కలంగా ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.