'ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'
ADB: ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జరగనున్న పదవతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రతి కేంద్రంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, త్రాగునీరు, పలు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.