వరంగల్ మార్కెట్‌లో సరుకుల ధరలు ఇలా..!
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 3రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,905 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.19,800 ధర పలకగా.. వండర్ హాట్(WH) రూ. 29,000 పలికింది. తేజ మిర్చి ధర రూ.19,400, ఎల్లో మిర్చి రూ. 22వేలు పలికాయి. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి.