కాంగ్రెస్ నేతల ఘర్షణ కమలాపూర్‌లో చర్చనీయాంశం
హన్మకొండ కమలాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు సంబరాల సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రణవ్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వర్గాల మధ్య బహిరంగంగానే ఘర్షణ చోటుచేసుకుంది. బస్టాండ్ కూడలిలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు నెట్టుకోవడంతో పాటు తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.