VIDEO: గ్యాస్ సరఫరాపై అదనపు కలెక్టర్ ఫోకస్
MDK: పాపన్నపేట మండల కేంద్రంలో అదనపు కలెక్టర్ నగేష్ ఎరువులు, గ్యాస్ సరఫరా పరిస్థితులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అగ్రో సెంటర్, గ్యాస్ గోదాములను సందర్శించి స్టాక్ వివరాలు, బుకింగ్ రికార్డులను పరిశీలించారు. జిల్లాలో ఎరువులు, గ్యాస్ కొరత లేదని, సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.