నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ
BDK: మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చండ్ర నరేంద్ర కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని సీతారాంపురం పంచాయతీ నందు వర్షాల వల్ల నష్టపోయిన పంటలను సీపీఐ ప్రతినిధి బృందం పరిశీలించింది.