శ్రమదానంతో మట్టి రోడ్డు నిర్మాణం

శ్రమదానంతో మట్టి రోడ్డు నిర్మాణం

ASR: గూడెంకొత్తవీధి మండలం లక్కవరపుపేట పంచాయతీ పోతురాజుగుమ్మాలుకి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో చేసేది ఏమీ లేక గ్రామస్థులంతా ఏకమై శ్రమదానంతో లక్కవరపుపేట నుంచి పోతురాజుగుమ్మాలు వరకు మట్టిరోడ్డు నిర్మాణం చేపట్టారు.