చిరుత దాడిలో గాయపడిన చిన్నారికి పోలీసుల సాయం

ప్రకాశం: దోర్నాల మండలం చిన్నారుట్ల గిరిజన గూడెంలో ఇంటి బయట నిద్రిస్తున్న కుడుముల అంజమ్మ అనే పాపపై ఇటీవల చిరుతపులి దాడి చేస్తుండగా తండ్రి అంజయ్య గట్టిగా అరిచాడు. దీంతో చిరుతపులి పాపను వదిలి చెట్ల పొదల్లోకి వెళ్ళింది. బాలికను సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. గురువారం ఎస్సై మహేష్, సిబ్బంది స్పందించి బాధిత చిన్నారికి వైద్యం కోసం సాయం అందించారు.