స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉండొద్దు: ఎంపీ
WNP: విద్యార్థులకు అందాల్సిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్కాలర్షిప్లు పెండింగ్ లేకుండా చూడాలని ఎంపీ మల్లు రవి అధికారులను ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఆగిపోయిన వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు. నిధుల సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.