ఎమ్మెల్సీకు ట్రోఫీ అందజేసిన సీఎం
VZM: విజయవాడలో జరిగిన ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల్లో జిల్లా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ సత్తా చాటారు. వాలీబాల్, రన్నింగ్, టేబుల్ టెన్నీస్ వంటి వివిధ అంశాల్లో ఆమె ప్రథమ స్థానంలో నిలిచి అందరినీ ఆకట్టుకున్నారు. 'ఆట విడుపు' పేరిట శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఆమెకు ట్రోఫీని అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.