నక్ష ప్రాజెక్టును వేగవంతం చేయాలి: కలెక్టర్
ATP: నక్ష ప్రాజెక్టు ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణ భూములకు కచ్చితమైన రికార్డులు, ప్రాపర్టీ కార్డులు జారీ చేయడమే ఈ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.