నేడు భారీగా మావోయిస్టుల లొంగుబాటు
TG: రాష్ట్రంలో మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగలనుంది. సుమారు 30 మంది మావోయిస్టులు ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, లొంగిపోయిన వారి నేపథ్యాన్ని డీజీపీ మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నారు. లొంగిపోయిన వారిలో కీలక దళ సభ్యులు ఉన్నట్లు సమాచారం.