వైసీపీకి షాక్.. వీగిన ఎంపీపీ అవిశ్వాస తీర్మానం
KRNL: ఆదోని ఎంపీపీ బడాయి దానమ్మపై వైసీపీ తెచ్చిన అవిశ్వాస తీర్మానం విఫలమైంది. తీర్మానం కోసం 29 మంది సభ్యుల్లో 19 మంది హాజరుకావాల్సి ఉండగా, కేవలం 16 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో రిటర్నింగ్ అధికారి అవిశ్వాస తీర్మానాన్ని అమాన్యమని ప్రకటించి, ఎంపీపీగా దానమ్మ కొనసాగుతారని స్పష్టం చేశారు.