'ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతోంది'
VKB: ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతోందని కాంగ్రెస్ నాయకుడు జితేందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం చెన్నాయపల్లి తండాలోని మాల గుడిసెల కాలనీలో కాంగ్రెస్ నాయకులతో కలిసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.