'పేదల సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం'
GNTR: పేదల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి గరువుపాలెంలో బుధవారం ఆయన దివ్యాంగులు, వృద్ధులకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటి వద్దనే పంపిణీ చేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటరామరాజు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.