విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి

WGL: ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన నల్లబెల్లి మండలం రంగాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గుర్రం సునీల్ తన ఇంటికి విద్యుత్ సరఫరా కాకపోవడంతో విద్యుత్తు తీగను సరి చేస్తుండగా ఒక తీగ విద్యుత్ పోల్‌పై మరో తీగ సునీల్‌కు తాకడంతో ప్రమాదానికి గురై మృతి చెందాడు.