'అడవులను కాపాడుకుంటేనే భవిష్యత్తు'

MNCL: అడవులను కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని జన్నారం మండలంలోని ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ శ్రీధర్ చారి సూచించారు. శుక్రవారం ఆయనను విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మనిషి మనగడకు అడవి కూడా ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కడార్ల నరసయ్య, ప్రధాన కార్యదర్శి నర్సింగోజీ శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు.