మార్కాపురంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

మార్కాపురంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

ప్రకాశం: మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయవద్దని కోరుతూ YCP ఆధ్వర్యంలో మార్కాపురంలో సోమవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. స్థానిక వైసిపి ఇన్‌ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం అయితే పేదలకు వైద్య సేవలు, విద్య అందవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలు సేకరించి గవర్నర్‌ను కలుస్తామని తెలిపారు.