VIDEO: మున్నేరు వాగు ఉధృతి .. రహదారులు మూసివేత

MHBD: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం ఉదయం మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వాగు ఉధృతి కారణంగా కొన్ని ప్రాంతాలకు వెళ్లే రహదారులు మూసివేయబడడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.