పదో తరగతి ఫలితాలపై జిల్లా కలెక్టర్ హర్షం

పదో తరగతి ఫలితాలపై జిల్లా కలెక్టర్ హర్షం

JGL: జిల్లా 2025 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో 4వ స్థానం సాధించిన జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చూపినందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తన చాంబర్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాము, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.