సీఎం వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్

సీఎం వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్

TG: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీమంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రెండేళ్లుగా కేసీఆర్, BRS పార్టీపై ఏడ్వటం తప్ప నువ్వు చేసింది ఏముందని సీఎంపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినా వెనుకటి గుణం మార్చుకోలేకపోతున్నారని విమర్శించారు. కాగా, SLBC పనులు ఆగిపోతే మామ, అల్లుళ్లు డ్యాన్సులు చేస్తున్నారని దేవరకొండ సభలో సీఎం రేవంత్ విమర్శలు చేశారు.