‘మోదీకి సన్నిహితులంటూ ఎవరూ లేరు’

ప్రధాని మోదీ వ్యక్తిగత జీవితంపై కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీకి సన్నిహితులంటూ ఎవరూ లేరని పేర్కొన్నారు. ఒక గొప్ప ఆశయంతోనే మోదీ తన కుటుంబాన్ని వదిలి వచ్చారని, దేశానికి సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని ఆయనకు స్పష్టత ఉందన్నారు. మనం చేసే పనిపై పూర్తి అవగాహన ఉండాలని ఆయన చెబుతారని, ఏళ్ల క్రితం మాట్లాడిన అంశాలను కూడా గుర్తుంచుకుంటారని స్మృతి తెలిపారు.