ఆ దేశాలకు ఉల్లి ఎగుమతికి భారత్ గ్రీన్ సిగ్నల్

విదేశాలకు ఉల్లి ఎగుమతిపై గత ఏడాది విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలిస్తోంది. మిత్రదేశాలైన బాహ్రెయిన్, మారీషస్, భూటాన్కు ఉల్లిని ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. బాహ్రెయిన్కు 3000 మెట్రిక్ టన్నులు, మారీషస్కు 1200 మెట్రిక్ టన్నులు, భూటాన్కు 550 మెట్రిక్ టన్నుల చొప్పున ఉల్లి ఎగుమతి కానుంది.