VIDEO: 'ఎకో టూరిజం అభివృద్ధి చేసేలా చర్యలు'

ములుగు: జిల్లాలో పర్యాటకులను ఆకర్షించేలా ఏకో టూరిజం అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు మండలంలోని ఇంచర్ల ఎర్రగట్టమ్మ వద్ద ఎకో పార్కులో శుక్రవారం మంత్రి సీతక్క సందర్శించి అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.