స్వచ్ఛరథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గం జి సిగడాం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ రథం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పాల్గొని స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.