‘తిమ్మరాజుపల్లి టీవీ’ ట్రైలర్ డేట్ ఫిక్స్
హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’ విడుదలకు సిద్ధమైంది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాను ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర బృందం, ఏప్రిల్ 9న మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.