VIDEO: కల్పవృక్ష వాహనంపై అమ్మవారి దర్శనం

VIDEO: కల్పవృక్ష వాహనంపై అమ్మవారి దర్శనం

TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో అమ్మవారు భక్తులను కనువిందు చేశారు. వాహనం ముందు అశ్వ, గజ, తురగలు నడుస్తుండగా భజన బృందాల కళా ప్రదర్శనలు నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.