లొట్లపల్లిలో అఖిల భారత పశుగణన కార్యక్రమం

VZM: జామి మండలంలోని లొట్లపల్లి గ్రామంలో బుధవారం 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ పశుసంవర్ధక సహాయకురాలు ఎస్.లక్ష్మీ ఇంటింటికి వెళ్లి పశుగణన చేపట్టారు. అంతేకాకుండా పశుగణన సంబంధించిన పోస్టర్ కూడా ఇంటింటికి వెళ్లి అంటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.