తెరుచుకున్న సరళా సాగర్ సైఫన్ గేట్లు

MBNR: దేవరకద్ర నియోజకవర్గంలో మదనాపురం మండలం పరిధిలోని సరళా సాగర్ గేట్లు తెరుచుకోవడంతో నీరు ప్రవహించింది. గత రెండు రోజులుగా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో సరళా సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం సరళా సాగర్ ప్రాజెక్టు సైఫన్ గేట్లు తెరచుకోవడంతో నీరు దిగువకు ప్రవహించింది.