శభాష్.. DPL ఆర్గనైజర్లు: సీఐ రాజా గౌడ్
MDK: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్, ఎస్సై బాలరాజు సూచించారు. ప్రగతి ధర్మారంలో గురువారం క్రికెట్ ఆర్గనైజర్స్ రాకేష్, నరేష్, సలీం, సురేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మారం ప్రీమియర్ లీగ్(DPL)లో 'సే నో టు డ్రగ్స్' పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువతను క్రీడల వైపు మళ్లిస్తున్న DPL ఆర్గనైజర్లను సీఐ రాజాగౌడ్ అభినందించారు.