ఆ సమయంలో ఫోన్ చూస్తున్నారా?

చాలామంది అర్థరాత్రి వరకు ఫోన్ చూడటంతో పాటు ఉదయం లేవడంతోనే ఫోన్ వాడుతారు. ఇలా చేయడం వల్ల మెదడుపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ పనిపై ఫోకస్ పెట్టలేరు. నెగటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. కంటి సమస్యలు తలెత్తుతాయి. ఉదయాన్నే ఫోన్ చూడటం వల్ల తలనొప్పి, నీరసం వంటివి వస్తాయి. గుండె సమస్యలు పెరుగుతాయి. డిప్రెషన్, ఆందోళన పెరుగుతుంది.