CJIపై దాడిని నిరసిస్తూ.. జంతర్ మంతర్‌లో ధర్నా
BHPL: చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) గవాయిపై న్యాయవాది కిషోర్ చేసిన దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రంగా ఖండిస్తూ.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్‌లో ఇవాళ భూపాలపల్లి MSP, MRPS జిల్లా బృందం నిరసన నిర్వహించింది. జిల్లా నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. CJI గవాయిపై దాడి చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.