ద్వారక కాంప్లెక్స్‌ను పరిశీలించిన మంత్రి
VSP: విశాఖ ద్వారక బస్ స్టేషన్‌ను రవాణా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ సందర్శించారు. బస్ స్టేషన్‌లోని పలు విభాగాలను పరిశీలించి, ప్రయాణికులకు తాగునీరు, పారిశుద్ధ్యం, విశ్రాంతి స్థలాలు, సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు. విజయనగరం జోన్ బస్సుల్లో 1620 ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్సులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.