'మన మిత్ర' ద్వారా ఎఫ్ఐఆర్ డౌన్‌లోడ్ సౌకర్యం: ఎస్పీ

'మన మిత్ర' ద్వారా ఎఫ్ఐఆర్ డౌన్‌లోడ్ సౌకర్యం: ఎస్పీ

ATP: పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా ఎఫ్ఐఆర్ ప్రతిని పొందవచ్చని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. 'మన మిత్ర' (95523 00009) నంబర్‌కు హాయ్ అని పంపి, పోలీస్ సర్వీసెస్ మెనూలో ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఈ విధానం వల్ల ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు పోలీస్ సేవల్లో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.