మహిళలతోపాటు పురుషులకు బస్సు ఫ్రీ
ADB: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి మూడు రోజులకు చేరుకుంది. అధికారులు ప్రైవేటు డ్రైవర్లను ఏర్పాటు చేసి బస్సులను నడిపిస్తున్నారు. అయితే బస్సుల్లో కండక్టర్లు లేకపోవడంతో మహిళలతో పాటు పురుషులు కూడా ఎవరు టికెట్టు తీసుకోకుండా ఉచితంగానే ప్రయాణం చేస్తున్నారు. బోథ్ నుండి నిర్మల్, ఆదిలాబాద్ రూట్లలో నడిచిన బస్సుల్లో ఉచితంగానే ప్రయాణం చేశారు.