హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి హామీ

BDK: అశ్వారావుపేట మండలం గండుగులపల్లిలోని తన నివాసంలో మంత్రి తుమ్మలను శనివారం కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు చిన్నశెట్టి యుగేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యుగేందర్.. దమ్మపేట శివాలయం ఎదురుగా హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని మంత్రిని కోరారు. సానుకూలంగా కూడా స్పందించిన మంత్రి..త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.