విద్యుత్ షాక్‌తో 5 గేదెలు మృతి

విద్యుత్ షాక్‌తో 5 గేదెలు మృతి

నిజామాబాద్ శివారులోని మాధవ్ నగర్లో విద్యుత్ షాక్‌తో ఐదు గేదెలు మృతి చెందినట్లు రూరల్ ఎన్‌హెచ్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం రాత్రి వీచిన ఈదురు గాలులకు చెట్లు విరిగి విద్యుత్ స్తంభంపై పడటంతో స్తంభం విరిగి వైర్లు అక్కడ ఉన్న గేదెలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో 5 గేదెలు అక్కడికక్కడే చనిపోవడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.